Kalyaname vaibhogame కల్యాణమే వైభోగమే

కళ్యాణమే వైభోగమే

పరిణయమే మరి పెళ్ళిసంబరమే (2)

అందాల వరుడు పరిశుద్ధుడు

చక్కాని వధువు కన్యాకు (2)

జరిగే పరిశుద్ధ వివాహమే

పెరిగే నీరంతరసంతోసమే (2)


1. ప్రేమాను పంచుకునే తోడుకై

ఆశగా చూసే హృదయముకు (2)

దేవుని దీవెనలే కురియగా

ఆమని కుసుమములే విరియగా

ముగిసే నిరీక్షణ సమయమే

మురిసే ప్రియమైన హృదయమే

యేసే ఏర్పరచినా దినమే

మనకన్నులకు ఆశ్చ్యర్యమే

                          || కళ్యాణమే ||


2. మరణాము తప్ప మరి ఏదియు

విడదీయనిది ఈ బంధము (2)

వ్యాధి భాధ సంతోషంలో

కలిమి లేమి ఆరోగ్యంలో

ప్రభువే ఒకటిగా దేవించెను

మనల్నే అందుకు నియమించెను

పరలోకములో నిర్ణయించెను

నరలోకములో ఏర్పరచెను 

                               || కళ్యాణమే ||





Post a Comment

Previous Post Next Post