అడిగే వాటికంటే - Adige Vatikante

 అడిగే వాటికంటే ఊహించే వాటికంటే 

అధికముగా చేయగలవు యేసయ్యా 

నన్ను నడిపే సారధివి నీవేనయ్యా (2)

(నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా)

                                       || అడిగే ||


1. చేసి ఉన్న ప్రార్ధన నేను 

మరచిపోయినా నువ్వు మరచిపోవుగా 

నా మంచి నాయనా అవసరాన్ని 

తీర్చమనే నా దీన యాచన (2)

పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన (2)

                                   || అధికముగా ||


2. అల్పమైన వాటిని ఆశించును 

నా హృదయం అధికమైన మేళ్ళనూ 

దాచును నీ మంచితనం 

ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం (2)

ఏది నాకు కావాలో 

ఎంచి యిచ్చు నీ జ్ఞానం (2)

                        || అధికముగా ||




Post a Comment

Previous Post Next Post