చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంతకాలం
కష్టాల బాటలోనే సాగదు పయనం (2)
విడుదల సమీపించెను
నీకు వెలుగు ఉదయించును (2)
|| చెమ్మగిల్లు ||
1. నీవు మోసిన నిందకు ప్రతిగా -
పూదండ ప్రభువు యిచ్చునులే
నీవు పొందిన వేదనలన్నీ -
త్వరలో తీరిపోవునులే (2)
నీ స్థితి చూసి నవ్వినా వారే -
సిగ్గుపడేదినమొచ్చెనులే (2)
విడుదల సమీపించెను
నీకు వెలుగు ఉదయించును (2)
|| చెమ్మగిల్లు ||
2. అనుభవించిన లేమిబాధలు -
ఇకపై నీకు వుండవులే
అక్కరలోన ఉన్నవారికి -
నీవే మేలు చేసేవులే (2)
మొదట నీ స్థితి కొంచెమే ఉన్న-
తుదకు వృద్ధిని పొందునులే (2)
విడుదల సమీపించెను
నీకు వెలుగు ఉదయించును (2)
|| చెమ్మగిల్లు ||