Parishuddudu parishuddudanuchu పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు

పరిశుద్దుడు పరిశుద్దుడనుచు
అతిపరిశుద్ధ నామం పలుకుటకె
అర్హత నాకు లేదు యేసయ్య
పాపము లేని నీ పరిశుద్ధ రక్తమే
నన్ను శుద్ధి చేసి అర్హత కల్గించెనే
నాకోసమే నీ ప్రాణమునర్పించి
నీ రాజ్య వారసునిగా నన్ను చేసికొంటివి
అనుపల్లవి:
నిన్నే సేవింతును
నిన్నే ప్రేమింతును
నిన్నే పూజింతును
నిన్నే స్తుతియింతును
నిన్నే కీర్తింతును
నిన్నే ఆరాధింతును
చరణం:
అరునోదయమునే నీ పాద సన్నిధిలో
నా స్త్రోత్ర బలులు నీకే అర్పింతును
నా యెడల నీవు చేసిన రక్షణ కార్యముకయి
కృతజ్ఞత కలిగి నే ఉందును
అతి పరిశుద్ధుడా
నీ కృప మరువను నేను
పాడేద జీవితాంతము (నిన్నే)
చరణం:
అంధకార లోకంలో చీకటి నన్నావరించగా
నీ కృపతో నను వెదకి రక్షించినావు
నీ నివాస స్థలమైన పరిశుద్ధపర్వతమునకు
నీ వెలుగుతో మార్గము చూపించావు
కోటి సూర్యకాంతిని మించిన తెజోమయూడా
ఆ వెలుగులో నడిపించుమ.. నన్ను (నిన్నే)



Post a Comment

Previous Post Next Post