సిలువలో ఆ సిలువలో Siluvalo aa siluvalo

 సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా

వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా

నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2)


1: నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు

భారమైన సిలువ మోయలేక మోసావు (2)

కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే

తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు


2: వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె

మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)

దూషించి అపహసించి హింసించిరా నిన్ను

ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా


3: నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్

నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్

నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం

సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను




Post a Comment

Previous Post Next Post