మరణశాసనపు కర్త Marana sasanapu karta

మరణశాసనపు కర్త మరణపు  ముల్లుతో  గుచ్చబడితివా.. ఆ... 

భూమి నిర్మాణ కర్త సమాధి గుహలో పెట్టబడిటివా.. ఆ.. 

కల్వరి గొఱ్ఱపిల్ల...... కలృరి గొఱ్ఱపిల్ల... ||2||


పల్లవి:మరణశాసనపు కర్త మరణపు  

ముల్లుతో  గుచ్చబడితివా.. ఆ... 

భూమి నిర్మాణ కర్త సమాధి 

గుహలో పెట్టబడిటివా.. ఆ..

నా పాపము నిమ్మితమై 

దొషివని తీర్పు నొందితివా.. ఆ.. 

నా శాప విమోచనమునకై 

శాప గ్రాహిగా మారీతివా.. ఆ.. 

కల్వరి గొఱ్ఱపిల్ల..... కల్వరి గొఱ్ఱపిల్ల ||4||   ||మరణ||


1: బాల్య వయస్సు దినములనుండి 

తలంపుల వ్యూహాలంతయు 

కేవలము చెడ్డది కాగా పాపినై పోతిని... ||2||


నశించిన వారిని 

వెదకి రక్షించుటకు 

పరము విడచి మనవుడిగా

 భూమికి దిగి వచ్చితివి ||2||


నా పాప భారమును 

సిలువలో భరించితివి ||కల్వరి||


2: మంచి చెడుల

తెలివిని ఇచ్చే

వృక్షఫలము ఆజ్ఞ విషయమై

అతిక్రమ పరిహారముగా 

మరణ శిక్ష వచ్చెను ||2||


కడపటి ఆదాముగా 

జీవింప చేయుటకు

ప్రేమ స్వరూపివై శిక్ష రద్దు చేసితివి    ||2||

మానవాలి మరణమును సిలువలోన పొందితివి

                                              ||కల్వరి||


3: లోక పాపమును మోసే 

దేవుని గొఱ్ఱపిల్లగా 

ఈ లోక రాజుల యెదుట

 మౌనివై ఉంటివి    ||2||


కొరడాలతో కొట్టిరి 

ప్రక్క లోన పొడిచితిరి 

మోముపై ఉమ్మి వేసి 

అపహాస్యము చేసితిరి  ||2||

/నిత్యత్వము  ఇచ్చుటకు సిలువను సహియించితివి 

                                                        ||కల్వరి||





Post a Comment

0 Comments