సూదురము ఈ పయనము Sooduramu Ee payanamu

సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము

యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా

నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి

సుమధుర భాగ్యము యేసుతో పయనము "2"


1: అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా

ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా

ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు

ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము

ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము||


2: హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా

 ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు

నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును

ఇది నా భాగ్యము నాలోని ధైర్యము

ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము||


3: నా జీవితం పదిలము యేసుని చేతిలో

నా పయనము సఫలము యేసుదే భారము

నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము

ఇది నా విశ్వాసము నాకున్న అభయము

కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||






Post a Comment

Previous Post Next Post