Naa Ashaalanni - నా ఆశలన్నీ తీర్చువాడా

నా ఆశలన్నీ తీర్చువాడా
నిన్నే నే నమ్మితినయ్య
నాకున్న ఆధారం నీవెనయ్య
నా క్షేమమంతయు నీలోనయ్య
ఏదైన నీ వల్లె జరుగునయ్య

1:ఊహించలేదు నేనెప్పుడు
నేనంటే నీకు ఇంత ప్రేమనీ
పగిలిపోయిన నా హృదయమును
నీ గాయాల చేతితో బాగుచేసావే

2:ఇక ఈ బ్రతుకు ఐపోయిందని
నిర్థారించిన వారు ఎందరో
విసిగిపోయిన నా ప్రాణమును
ప్రతి రోజు క్రొత్తగా బ్రతికించుచున్నావే

3:ఆశించితి నేను నీ చెలిమిని
కడవరకు నీతోనే బ్రతకాలని
మిగిలిపోయిన ఈ అధముడను
నీ సేవచేసే భాగ్యమిచ్చావే






Post a Comment

Previous Post Next Post