పరిమళతైలం నీవే Parimala Tailam Nive

పరిమళతైలం నీవే

తరగని సంతోషం నీలో

జీవన మకరందం నీవే

తియ్యని సంగీతం నీవే


అ. ప: 

తరతరములలో నీవే

నిత్యసంకల్ప సారధి నీవే

జగములనేలే రాజా

నా ప్రేమకు హేతువు నీవే


1. ఉరుముతున్న మెరుపులవంటి

తరుముచున్న శోధనలో ||2||

నేనున్నా నీతో అంటూ నీవే

నాతో నిలిచినావు

క్షణమైనా విడువక ఔదార్యమును

నాపై చూపినావు

నీ మనసే అతి మధురం

అది నా సొంతమే..   ||పరిమళ||


2. చీల్చబడిన బండనుండి 

నా కొదువ తీర్చి నడిపితివి

నిలువరమగు ఆత్మ శక్తితో

కొరతలేని ఫలములతో

నను నీ రాజ్యమునకు పాత్రుని 

చేయ ఏర్పరచుకొంటివి

నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు

నీ మహిమార్ధం వాడబడే

నీ పాత్రను నేను..  ||పరిమళ||


3. వేచియున్న కనులకు నీవు

కనువిందే చేస్తావని

సిద్ధపడిన రాజుగా నీవు

నాకోసం వస్తావని

నిను చూచిన వేళ నాలో ప్రాణం

ఉద్వేగభరితమై

నీ కౌగిట ఒదిగి ఆనందముతో

నీలో మమేకమై

యుగయుగములలో నీతో

నేను నిలిచిపోదును...  ||పరిమళ||





Post a Comment

Previous Post Next Post