Ee stuti neeke maa yesu deva ఈ స్తుతి నీకే మా యేసు దేవా

 పాట రచయిత: తిమోతి పరిశపోగు


ఈ స్తుతి నీకే మా యేసు దేవా

(మా) మనసారా నిన్నే సేవింతుము – (2)

పరలోక దూతాలి స్తోత్రాలతోనే`

మా స్తోత్ర గానాలు గైకొనుమా (2) 

                             ||ఈ స్తుతి||


1: జగతికి పునాది నీవని

మాలోన ఊపిరి నీదేనని (2)

మా పోషకుడవు నీవేనని

మా కాపరివి నీవేనని (2)

మా హృదయాలలో ఉండాలని

నీ సాక్షిగా మేము బ్రతకాలని

                           ||ఈ స్తుతి||


2: మనసారా నీ దరి చేరగా

మాకెంతో సంతోషమాయెగా (2)

హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో

మా హృది ప్రవహించే సెలయేరులా (2)

నీ మధుర ప్రేమను చాటాలని

నీ జీవ బాటలో నడవాలని

                           ||ఈ స్తుతి||





Post a Comment

Previous Post Next Post