స్తోత్రం స్తుతి స్తోత్రం
మహిమ ఘనత నీకే
అర్పింతును యేసయ్య (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన -
నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి ||
1: బాధ కలుగు సమయములో
నాకు తోడై నిలిచి
కష్ట నష్టాలలో
నాకు నీడై నిలచి (2)
నను ధైర్యపరచితివి
నా వెంట నిలిచితివి (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి ||
2: నే చేసిన పాపముకై
శిక్ష నీవు పొందితివి
నే చేసిన దోషముకై
సిలువలో మరణించితివి (2)
మృతుంజయుడైలేచి
మరణనే గెలిచితివి (2)
నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము (2) || స్తోత్రం స్తుతి ||
తి
||