Karunagala Nee Maatatho కరుణాగల నీ మాటతో

 కరుణగల నీ మాటతో 

నా కన్నీరు తుడిచావయ్య 

కలతలో ఉన్న నా మనసుకు 

ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్య (2)


నీ మాటే నాకు ప్రాణం 

నీ మాటే నాకు క్షేమం 

నీ మాటే నాకు సర్వం 

నీ మాటలో ఉంది జీవం (2)      || కరుణగల ||


1. ఈ లోక యాత్రలో 

 నా ఒంటరి పయనంలో - ఎందరెందరో నన్ను 

దూషించినారయ్య అవమానించారయ్య   (2)

ఈ మనుషుల మాటలలో ఆదరనే లేదయ్యా  (2)

నీ మాటతో నన్ను ఆదరించి నావయ్య (2)

                                                        || నీ మాటే |


2. ఆత్మీయ యాత్రలో 

నీ సన్నిధానంలో - నీ వాక్యముతో 

బలపరిచినవయ్య నెమ్మదినిచ్చావయ్య (2)

నీ కృప క్షేమములే నా వెంటేవచ్చెనయ్య (2)

నీ సన్నిధిలో నన్ను ధైర్యపరిచి నావయ్య (2) 

                                                           || నీ మాటే ||





Post a Comment

0 Comments