Neevu Tappa Naaku Ilalalo - నీవు తప్ప నాకు ఇలలో

పల్లవి:

నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా

నీ ప్రేమ కన్నా సాటి  భువిపై ఏదీ లేదయ్యా 

నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా 

నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా 

నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలేదయ్యా

గుండెనిండా నిండున్నావు ఓ నాయేసయ్యా

                

1:కష్టాలచెరలో చిక్కుకున్న నన్ను

నీ ప్రేమవరమే కురిపించినావు 

ఈ లోకమంతా వెలివేస్తున్న 

నీ ప్రేమ నాపై చూపించినావు

నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా

నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా 

నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా

                 

2: కన్నీటి అలలో మునిగిన నన్ను 

నీ దివ్యకరమే అందించినావు

ఆ సిలువలోనే నీప్రాణమును 

నను రక్షింప అర్పించినావు 

నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా

ఒక క్షణం వీడక కాపాడినావయ్యా 

నాశ్వాసై నాధ్యాసై నువ్వుంటే చాలయ్యా




Post a Comment

Previous Post Next Post