Neelone Anandam - నీలోనే ఆనందం

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

నిన్న నేడు నిరంతరం మారని దేవా

ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం

నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)


1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను -

   ఏది నా సొంతం కాదనుకున్నాను (2)

   తప్పిపోయిన కుమారుని నేనయితే -

   నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)


2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా

    ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)

    నన్ను మరువని ప్రేమ నీదయ్యా

    నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)




Post a Comment

Previous Post Next Post