నీవే శ్రావ్యసదనము Nive Sraavyasadhanamu

నీవే  శ్రావ్యసదనము

నీదే  శాంతి వదనము

నీ  దివి సంపద నన్నే చేరగా

నా  ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా

నా ప్రతి స్పందనే ఈ ఆరాధన

నా హృదయార్పణ నీకే  యేసయ్యా

                                        || నీవే || 


1.విరజిమ్మే నాపై కృప కిరణం

విరబుసే పరిమళమై కృప కమలం  ||2||

విశ్వాసయాత్రలో ఒంటరినై

విజయ శిఖరము చేరుటకు

నీ దక్షిణ హస్తం చాపితివి

నన్నాదుకొనుటకు వచ్చితివి

నను బలపరచి నడిపించే

నా  యేసయ్యా         ||నీవే||


2. నీ నీతి నీ  రాజ్యం వెదకితిని

నిండైన సౌభాగ్యం పొందుటకు ||2||

నలిగి విరిగిన హృదయముతో

నీ వాక్యమును సన్మానించితిని

శ్రేయస్కరమైన దీవెనతో

శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు

నను ప్రేమించి పిలచితివి

నా  యేసయ్యా        ||నీవే||


3. పరిశూద్దాత్మకు నిలయముగా

ఉపదేశమునకు వినయముగా ||2||

మహిమ సింహాసనము చేరుటకు

వధువు సంఘముగా మార్చుమయా

నా పితరులకు ఆశ్రయమై

కోరిన రేవుకు చేర్పించి

నీ  వాగ్దానం నెరవేర్చితివి

 నా యేసయ్యా           ||నీవే||







Post a Comment

Previous Post Next Post