నీకేగా నా స్తుతిమాలిక Nikega Na Stuthi Malika

పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక 

నీ కొరకే ఈ ఘనవేదిక 

నీ ప్రేమ నాపై చల్లారిపోదు                           

మరణానికైనా వెనుతిరుగలేదు 

మన లేను నే నిన్ను చూడకా 

మహా ఘనుడా నా యేసయ్య  

                                            ||నీకేగా||


1. సంతోష గానాల స్తోత్రసంపద 

నీకే చెల్లింతును ఎల్లవేళల 

అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా 

నీ గుణశీలత వర్ణింపతరమా   ||2||

నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా

నీవులేని లోకాన నేనుండలేనయ్యా 

నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా  ||2||

                                                  ||నీకేగా||


2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ 

వేరే జగమందు నే ఎందు వెతికినను 

నీతిభాస్కరుడా నీ నీతికిరణం 

ఈ లోకమంతా ఏలుచున్నదిగా ||2||

నా మదిలోన మహారాజు నీవేనయ్య

ఇహపరమందు నన్నేలు తేజోమయ

నీ నామం కీర్తించి ఆరాధింతును||2|| 

                                               ||నీకేగా||


3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు

వేరే ఆశేమియు  లేదు నాకిలలో 

నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా

ఆపాద మస్తకం నీకేగా అంకితం  ||2||

నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా

నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా

నీ కొరకే నేనిలలో జీవింతును  ||2||   

                                             ||నీకేగా||





Post a Comment

Previous Post Next Post