విత్తనం విరుగక పోతే VITHANAM VIRUGAKA POTHEY

విత్తనం విరుగక పోతే - ఫలియించునా ? 

కష్టాలే లేక పోతే - కిరీటమే వచ్చునా 


శ్రమలే నా అతిశయం - శ్రమలోనే ఆనందం 

శ్రమల యందే ఉత్సాహం - విశ్వాసమే నా బలం 


చరణం 1: 

పోరాటం దేవునిదైతే - నాకెల ఆరాటం (2)

విశ్వసించి నిలుచుంటేనే - విశ్వాస విజయ కిరీటం 

గొల్యాతును పుట్టించినదే - దావీదు ను హెచ్చించుటకే (2)

కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా (2)

                                                              " శ్రమలే "


చరణం 2: 

సేవించే దేవుడు రక్షించక మానునా (2)

రక్షించక పోయినా సేవించుట మానము 

ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకు నే (2)

అగ్ని లో ప్రభువే రాగా - ఆరాధన ఆగునా (2)                     " శ్రమలే "


చరణం 3 : 

ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు

 శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)

ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే 

వాగ్దానం నెరవేర ఫరోలు రావద్దా (2) 




Post a Comment

Previous Post Next Post