జయించిన యేసయ్యా JAYINCHINA YESAYYA

జయించిన యేసయ్యా నీ తోడు చాలు 

బలహీనత లో నీ కృప చాలు (2) 

లోకమంతా ఒక్కటై నను వేరు చేసినా 

అక్షయత ను కోరే నీ చెలిమి చాలు (2) 


నీ తోడు చాలయ్యా - నాకు నీ కృప చాలయ్యా  (2) 


చరణం 1: 

పాప లోక అగాధాల లో పడనేయక చేయి పట్టి 

స్వార్థ ప్రియుల లోకములో స్నేహ బంధమైనావు (2)

ప్రేమ చూపే ప్రానేశ్వరుడా నిను మరువ లేను 

నీ తోడు లేకుండా నేను బ్రతుక లేను  (2)  " జయించిన " 


చరణం 2: 

అంధకార లోకమందు నా వెలుగు దేపమై 

హతమార్చే ఆపదలో ఆశ్రయ పురమైనావు (2)

ఆదుకున్న ఆశ్రయుడా నిను మరువ లేను 

నీ తోడు లేకుండా నేను బ్రతుక లేను (2)  " జయించిన " 


చరణం 3:

నీళ్ళు లేని ఎడారి లో జీవ జలము నీవై 

నిలువ నీడ లేని నాకు నిత్య నివాసమైనావు (2) 

నీడ నిచ్చిన నిఖిలేశ్వరుడా నిను మరువ లేను

నీ తోడు లేకుండా నేను బ్రతుక లేను (2) " జయించిన " 





Post a Comment

Previous Post Next Post