చిత్రమైన పుట్టుక నీది Chitramaina Puttuka Needhi

చిత్రమైన పుట్టుక నీది 

మేము సంతసించు వెళాయేయిది||2||

నీ ఒక్క జన్మము ఓ గొప్ప మర్మము||2||

పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం||2||

                                             ||చిత్రమైన||


1) సృష్టికర్తవై శరీరధారిగా

పుడమిపై వెలసిన పూజ్యనీయుడా

పరమతండ్రివై పాపరహితునిగా 

ప్రేమ తోడ వచ్చిన యేసునాథుడా||2||

ఊహకు అందదే నీ ప్రేమ మాదుర్యము

వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము||2||

చిత్రమే విచిత్రమే....

యేసయ్య నీ జననము||2||చిత్ర||


2) సర్వ జనుల పాపపరిహార్థమై

కన్య మరియా గర్భమందు ఉద్భవించావు

సర్వ ప్రజల రక్షణార్థమై 

పరిశుదుని గా ఇలలో పుట్టీయున్నావు||2||

చీకటిలోనా జీవనజ్యోతిగా

మరణఛాయలో  జీవప్రదాతగా

దివి నుండి భువి కొచ్చిన

ఇమ్మానుయేలువే ... ఓ..ఓ...

                                                 ||చిత్రమైన||










Post a Comment

Previous Post Next Post