ఏ రాగమో Ye Ragamo By Sahus prince

ఏ రాగమో తెలియదే.....

అశతో వున్నా... తృష్ణకలిగున్నా.. ఆరాధించాలని..

ఆత్మతో సత్యముతో... 

నా పూర్ణహృదయముతో

నిన్ను ఘనపరచాలాని...

ఏ రాగమో తెలియదు.. 

ఏ తాళమో తెలియదు.. 

ఏమని పాడను  నిన్ను-ఎంతని పోగడను 

యేసయ్యా.....యేసయ్యా......  ||2||


1. ఓటములలో- ఓదార్పువై 

ఓర్పు నేర్పించావయ్యా

వేదనలలో- విశ్రాంతివై 

వెన్నంటి నిలచావయ్యా 

జీవితం నీదయ్యా నాకన్నదేముందయ్యా

 నాకున్నదంతనీవే కదా..

యేసయ్యా.....యేసయ్యా....  ||2||


2. నీచేతితో చేశావులే  నీరూపమిచ్చావులే 

నాచెంతకే చెరావులే 

నా సొంతమైయ్యావులే

మాటలే లేవయ్యా అర్థమే కాదయ్యా

ఈ శిలకోసం బలియాగమా...

యేసయ్యా.....యేసయ్యా...  ||2||


యేసయ్యా.....యేసయ్యా...  ||2||


యేసయ్యా.....యేసయ్యా...  ||2|





Post a Comment

Previous Post Next Post