ఆడపిల్లగా కాకపోతిని
మగబిడ్డగా మారకపోతిని ||2||
యేసయ్యా నా యేసయ్యా
నీ పాత్రగా మార్చబడితినయ్య ||2||
||ఆడపిల్లగా ||
1) తల్లి గర్భాన నే సంతోషముతో
కడుపున పుట్టాను
భువిపై అడుగును పెట్టాను
తండ్రి పక్షాన బహు ఆనందముతో
గంతులు వేసాను
తన భుజమున తిరిగాను ||2||
పరువు ప్రతిష్టకు బలిగా వెలివేయబడినాను
కన్నవారితో కఠినంగా
అసహ్యంచుకోబడ్డాను "2"
నా యేసయ్యా నన్ను ఆదుకొంటివి
హక్కున చేర్చుకుంటివి
నీసాక్షి గా వాడుకొంటివి ||ఆడపిల్లగా ||
2 ) బంధువులే రాబంధులై
నా హృదయమెంతో గాయపరిచారు.
నన్ను అవమానించారు
స్నేహితులే రాక్షసులై
నా యవ్వన దశను తప్పుగా మలిచారు
ఎన్నో నిందలు వేశారు ||2||
చివరికి అనాధిగా లోకంలో తిరిగాను
కడుపు కూటికై రోడ్డున పడి
చప్పట్లను కొట్టాను. ||2||
నా యేసయ్యా నీవే నాస్థితిని మార్చితివి
కొడుకులు కూతుళ్ల కంటే
శ్రేష్టమైన పేరు పెడితివి ||ఆడపిల్లగా||