కంచే వేశావు మా ఇంటికి kanche vesavu maa intiki

కంచే వేశావు మా ఇంటికి

కరుణ చూపావు మా బ్రతుకులో

నీతి సూర్యుడా తేజోమయుడా

నీ వెలుగు మా ఇంట నింపావయ్యా

నీవుండగా ఏ లోటు లేనెలేదు యేసయ్యా

నేను నా ఇంటివారము నిన్నే సేవించెదం


1:దీన దశలో మేముండగా

శోధనలన్నీ దూరము చేసితివి

నీరు కట్టిన తోటగ చేసి

ఫలము పంటలతో సమృద్ధి నిచ్చితివి

యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ

మా ప్రతి అవసరము తీర్చావయ్యా


2:పరిస్థితులన్నీ చేజారగా

చుక్కాని నీవై దరిచేర్చినావు

వ్యాధి భాధలు రాకుండ చేసి

మేమెళ్ళు స్థలమందు ఆశ్రయమైనావు

యెహోవా రోహివై సంరక్షించుచు

మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి




Post a Comment

Previous Post Next Post