నూతన గీతము నే పాడెదా -
మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను -
నే మరువను - ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే -
సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. కొలువుచేసి ప్రేమించినావు –
కోరదగినది ఏముందినాలో-
స్వార్ధ మెరుగని సాత్వీకుడా -
నీకు సాటెవ్వరూ (2)
నీవే నా ప్రాణము –
నిను వీడి నేనుండలేను (2)
||నూతన||
2. కడలి తీరం కనబడనివేళ -
కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా -
నీకు సాటెవ్వరూ (2)
నీవేనా ధైర్యమూ -
నీ కృపయే ఆధారమూ (2)
||నూతన||
3. మేఘములలో నీటిని దాచి –
సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన -
నీకు సాటెవ్వరూ(2)
నీవేనా విజయమూ -
నీ మహిమయే నా గమ్యమూ (2)
||నూతన||