నీ మాట జీవము గలదయ్య Nee maata jeevamu galdayya

నీ మాట జీవముగలదయ్య యేసయ్య 

నీ మాట సత్యము గలదయ్య..........

 నీ మాట మార్పు లేనిదయ్య యేసయ్య 

నీ మాట మరచిపోనిదయ్య (2) 

ఏది మారిన నీ మాట మారదయ్య .... 

ఏది ఆగిన నీ మాట జరుగునయ్య.... (2) 

                                          || నీ మాట ||

1:నశించుచున్న వారిని...

బ్రతికించును నీ మాట...

బంధింపబడిన వారిని...

విడిపించును నీ మాట... .(2)

త్రోవ తప్పిన వారిని...

సరిచేయును నీ మాట...

కృంగిపోయిన వారిని 

లేవనేత్తును నీ మాట.... (2)

                            ||….ఏది మారిన నీ మాట||

2:సింహలబోనులో నుండ...

 విడిపించును నీ మాట - 

అగ్ని గుండముల నుండి... 

రక్షించును నీ మాట (2) 

మారా బ్రతుకును కూడా...

మధురం చేయును నీ మాట...

ఆరిపోయిన బ్రతుకును...

 వెలిగించును నీ మాట..... (2) 

                              ||.....ఏది మారిన నీ మాట||








Post a Comment

0 Comments