పాడెద స్తుతి గానము Padedha Stuthiganamu (Song-3)

 (Song-3) 

పాడెద స్తుతి గానము 

కొనియాడెద నీ నామము "2" 

నీవే నా ప్రేమానురాగం 

క్షణమైనా విడువని స్నేహం 

అతి శ్రేష్టుడా నా యేసయ్య "2" ||పాడెద||


 1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే

నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు "2"

నీ ఆశలే నాలో చిగురించెను 

నీ వాక్యమే నన్ను బ్రతికించెను "2"

నీ అనుబంధము నాకు ఆనందమే "2" "||పాడెద||


2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే

నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2"

నీ చేతులే నను నిర్మించెను 

నీ రూపమే నాలో కలిగెను "2"

నీ అభిషేకము పరమానందమే "2" ||పాడెద||


3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే 

నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి "2" 

యూదా గోత్రపు కొదమ సింహమా 

నీతో నిత్యము విజయహాసమే "2"

నీ పరిచర్యలో మహిమానందమే "2" ||పాడెద||




Post a Comment

Previous Post Next Post