(Song-2)
నేను వెళ్ళే మార్గము –
నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట –
నేను సువర్ణమై మారెదను "2" ||నేను||
1:కడలేని కడలి తీరము –
ఎడమాయె కడకు నా బ్రతుకున "2"
గురిలేని తరుణాన వెరువగ –
నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్ "2" ||నేను||
2:జలములలోబడి నే వెళ్లినా –
అవి నా మీద పారవు "2"
అగ్నిలో నేను నడచినా –
జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్ "2" ||నేను||
3:విశ్వాస నావ సాగుచు –
పయనించు సమయాన నా ప్రభు"2"
సాతాను సుడిగాలి రేపగా –
నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్ "2" ||నేను||