ఊహించలేని మేలులతో నింపిన oohincha leni melulatho nimpina

ఊహించలేని మేలులతో నింపిన

నా యేసయ్యా నీకే నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్

వివరించగలనా నీ మేలులన్ (2)  ||ఊహించలేని||


1: మేలుతో నా హృదయం తృప్తిపరచినావు

రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)

ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా

స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||


2: నా దీనస్థితిని నీవు మార్చినావు

నా జీవితానికి విలువనిచ్చినావు (2)

నీ కృపకు నన్ను ఆహ్వానించినావు

నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||





Post a Comment

Previous Post Next Post