నేనున్న స్థితిలోనే Nenunna Stitilone


పల్లవి: నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు

ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు

అ.ప.:కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు

నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు


1:లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు

రెండవ రాకడవరకు విడువక నను నడిపించు

నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు


2:నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు

సరియగు త్రోవను నడువ కట్డడలను బోధించు

సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు










Post a Comment

Previous Post Next Post