నాదంటూ లోకాన Naadantu lokana

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా

ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)

నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||


1: నాకు ఉన్న సామర్ధ్యం

నాకు ఉన్న సౌకర్యం

నాకు ఉన్న సౌభాగ్యం

నాకు ఉన్న సంతానం (2)

ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2)

కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||


2: నాకు ఉన్న ఈ బలం

నాకు ఉన్న ఈ పొలం

త్రాగుచున్న ఈ జలం

నిలువ నీడ ఈ గృహం (2)

నిలచియున్న ఈ స్థలం

బ్రతుకుచున్న ప్రతి క్షణం (2)

కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||





Post a Comment

Previous Post Next Post