కరుణా సంపన్నుడ Karuna Sampannuda (Song-1)

కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా 

నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"

నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే 

నా యేసయ్యా సాత్వికుడా 

నీ కోసమే నా జీవితం "2" 

                             ||కరుణాసంపన్నుడా||


1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము 

నా హృదయసీమలోనే సందడిని చేసెను "2"

అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే 

ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2"

ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే

 నన్నే నడిపించెను

                          ||కరుణాసంపన్నుడా||   

                            

2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని 

ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2"

నీ కృపలో నిలిపినది - నీ ప్రేమబంధమే 

అనుదినము మకరందమే - నీ స్నేహబంధము "2"

ఆ ప్రేమలోనే కడవరకు నన్ను

నడిపించుమా స్థిరపరచుమా 

                            ||కరుణాసంపన్నుడా||


 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై 

నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2"


నా కోసం నిర్మించే సౌందర్యనగరములో 

ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2"

తేజోమయా నీ శోభితం

నే పొందెద కొనియాడెద

                              ||కరుణాసంపన్నుడా||









Post a Comment

Previous Post Next Post