ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతు నీలో దేవా "2"
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పొగడెదను "2"
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే "2"
||ఆరాధింతు||
1. యెరికో గోడలు అడ్డువచ్చినా
ఆరాధించిరే గంభీరముగా "2"
కూలిపోయెను అడ్డుగోడలు
సాగిపోయిరి కనాను యాత్రలో "2"
||ఆరాధన||
2. పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో
||ఆరాధన||
3. పౌలు సీలలు బంధింపబడగా
పాటలు పాడి ఆరాధించగా "2"
బంధకములు త్రెంచబడెను
వెంబడించిరి యేసయ్య నెందరో "2"
||ఆరాధన||