ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో
అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను (2)
కన్నీళ్లతో పాదాలు కడిగింది
1: తన కురులతో పాదాలు తుడిచింది (2)
సువాసన సువాసన ఇల్లంత సువాసనా
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ
ఆలాపన (2)
2: జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం
ఆ వాక్యమే నన్ను
బ్రతికించెను (2)
హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)
||ఆ భోజన||
3: సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం
దానియేలుకు ఆపై విడుదలిచ్చె
ఈ వాక్యం (2)
హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన
ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2)
||ఆ భోజన||