ఈ లోకం మాయరా
పరలోకం శాశ్వతమురా ||2||
నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా
నరుడా ఓ నరుడా
నిజ దేవుణ్ణి నమ్మరా ||2|| ఈ లోకం ||
1: పాపపు ఊబిలో మునగక
నరకానికి పోకురా
లోకాశలతో తిరుగకా దేవుని వైపు సాగర
దుష్టుని స్నేహం చెయ్యక పాడైపోవురా
దేవుని స్నేహం పొందర
చిరకాలం నిలుచురా
దేవుని రాకడ దగ్గర అవుతుందిరా
రాకడకై నీవు సిద్ధిమవ్వాలిరా } 2
నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా
నరుడా ఓ నరుడా
నిజ దేవుణ్ణి నమ్మరా ||2|| ఈ లోకం ||
2: మనిషి ప్రేమను నమ్మక నిలువునా ముంచేనురా
దేవుని ప్రేమ నిజమైందిరా
కడవరకు నిలిచేనురా
అందమున్నదని పొంగక అది కొంతకాలమేరా
ధనాపేక్షతో ఉండక అది నీ వెంట రాదురా
నీకై మరణించిన దేవుణ్ణి వెతకరా
దొరికిన క్షణమే రక్షింపబడతావురా ||2||
నరుడా ఓ నరుడా బైబిలు చేతి పట్టారా
నరుడా ఓ నరుడా
నిజ దేవుణ్ణి నమ్మరా ||2|| ఈ లోకం ||