అమరమైన ప్రేమ Amaramaina Prema (Song-7)

(Song-7) 

ప్రేమే  శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు

మనస్సే మందిరమాయే - 

నా మదిలో దీపము నీవే "2"

నిన్నాశ్రయించిన వారిని-

ఉదయించు సూర్యునివలెనే

నిరంతరం నీ మాటతో

ప్రకాశింపచేయుదువు ||2|| 

                                || ప్రేమే||


1.అమరమైన నీ చరితం - 

విమలమైన నీ రుధిరం        

ఆత్మీయముగా ఉత్తేజపరచిన -

పరివర్తనక్షేత్రము ||2||

ఇన్నాళ్ళుగా నను స్నేహించి - 

ఇంతగ ఫలింపజేసితివి

 ఈ సర్వసంపదనంతటితో - 

అభినయించి నే పాడేదను

 ఉండలేను - బ్రతుకలేను - 

నీతోడు లేకుండా - నీ నీడలేకుండా 

                               || ప్రేమే ||


2. కమ్మనైన నీ ఉపదేశము -

విజయమిచ్చె శోధనలో

 ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము -

ధైర్యమిచ్చె నా శ్రమలో ||2||

 కరువుసీమలో సిరులోలికించెను - 

నీ వాక్యప్రవాహము

 గగనము చీల్చి మోపైన - 

దీవెన వర్షము కురిపించితివి

 ఘనమైన నీ కార్యములు - 

వివరింప నా తరమా - వర్ణింప నా తరమా  

                                   || ప్రేమే ||


3. విధిరాసిన విషాదగీతం - 

సమసిపోయే నీ దయతో

 సంబరమైన వాగ్దానములతో - 

నాట్యముగా మార్చితివి   ||2||

 మమతల వంతెన దాటించి - 

మహిమలో స్థానమునిచ్చితివి

 నీ రాజ్యములో జేష్టులతో - 

యుగాయుగములు నే ప్రకాశించనా

 నా పైన ఎందుకింత -

గాఢమైన ప్రేమ నీకు 

మరువలేను యేసయ్య  

                                   ||ప్రేమే||





Post a Comment

Previous Post Next Post