కన్నీరేలమ్మా…
కరుణించు యేసు...
నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మా…
కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పె (2)
యేసే తోడమ్మా .... ఆఆ... ఆఆ.....
||కన్నీరేలమ్మా||
1: నీకేమీ లేదని ఏమీ తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా (2)
||కన్నీరేలమ్మా||
2: నీకెవరూ లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరచారా
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)
||కన్నీరేలమ్మా||