కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2)
||కళ్ళల్లో||
1: హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక
||కళ్ళల్లో||
2: కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా – సంతసించుము నీవిక
||కళ్ళల్లో||