దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
1: ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
2: ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
3: ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
4: బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
5: సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
6: తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
7: పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
8: మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
9: సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||