పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు parishuddudavayi mahima prabava mulaku

పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - 

నీవే పాత్రుడవు - బలవంతుడవై - 

దీనుల పక్షమై కృప చూపువాడవు - 

దయాలుడవై ధారాలముగా 

నను దీవించిన శ్రీమంతుడా

ఆరాధన నీకే నా యేసయ్య - ||2||


1. నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి - 

నిను సేవించుటకు

నీ మహిమ ప్రభావమును - 

కిరీటముగా - ధరింపజేసితివి.

శాశ్వత కాలము వరకు నీ 

సంగతిపై దృష్టి నిలిపి 

నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివి.

                                ||ఆరాధన||


2. నీనిత్యమైన ఆదరణ 

చూపి నను స్థిరపరచుటకు

నీ కరుణకటాక్షమును 

నాపై కురిపించి 

నను ప్రేమించితివి

నాకు ప్రయోజనము 

కలుగజేయుటకు 

నీ ఉపదేశమును బోధించి

నీ దాసుని 

ప్రాణమును సంతోషపరచితివి.

                                         ||ఆరాధన||


3. ఆనందకరమైన దేశములో నేను - 

నిను ఘనపరచుటకు

నీ మహిమాత్మతో నింపి 

సురక్షితముగా నన్ను

 నివసింపజేసితివి 2

మేఘవాహనుడవై వచ్చువరకు 

నే కనిపెట్టుచుందును నీ కోసము - 

నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదను.

                                          ||ఆరాధన||






Post a Comment

Previous Post Next Post