దీనుడా అజేయుడా Deenuda ajeyuda

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా

పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా

జీవదాతవు నీవని శృతిమించి పాడనా 

జీవధారవు నీవని కానుకనై పూజించనా

 అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే 

 స్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే 

                                      ||దీనుడా||


1 : సమ్మతిలేని సుడిగుండాలు - ఆవరించగా 

గమనములేని పోరాటాలే - తరుముచుండగా 

నిరుపేదనైనా నా యెడల - సందేహమేమీ లేకుండా 

హేతువేలేని-ప్రేమచూపించి - సిలువచాటునే దాచావు 

సంతోషము నీవే - అమృత సంగీతము నీవే 

స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే
                      
                               ||దీనుడా ||



2 : సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శీవై 

నిత్యనిబంధన నాతోచేసిన -సత్యవంతుడా

విరిగి నలిగినా మనస్సుతో - హృదయార్చనే చేసెద 

కరుణనీడలో - కృపావాడలో - నీతోవుంటే చాలయ్య

కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా 

విశ్వాసము నీవే - విజేయశిఖరము నీవేగా 
                              
                                 ||దీనుడా ||



3: ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే 

స్ఫటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమే

ఆ నగరమే లక్షమై - మహిమాత్మతో నింపినావు 

అమరలోకానా - నీ సన్నిధిలో - క్రొత్త కీర్తనేపాడెదను 

ఉత్సహము నీవే - నయన్తోత్సవము నీవేగా 

ఉల్లసము నీలో - ఊహాలపల్లకి నీవేగా 

                                   ||దీనుడా ||







Post a Comment

Previous Post Next Post