నా కృప నీకు చాలని Naa krupa neeku chalani

 నా కృప నీకు చాలని

  నా దయ నీపై ఉన్నదని

  నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని

  నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని

  నాతో మాట్లాడిన మహోన్నతుడా

  నన్నాదరించిన నజరేయ (2)

                                 || నా కృప ||


1: నేను నీకు తోడైయున్నానని

  పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)

  నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)

  పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2)

                                     || నాతో ||


 2: పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని

    ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)

    నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)

   జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2)

                                        || నాతో ||




Post a Comment

Previous Post Next Post