నీవు లేకుండా నేనుండలేను -
నాకున్నవన్నీ నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా -
నా ఊపిరి నీవే యేసయ్య
1: జాలిలేనిది ఈ మాయలోకము -
కలతచెందెను నా దీన హృదయము (2)
నను కాపాడుటకు నాదరి నిలచితివా -
హస్తము చాపితివా నను బలపరచితివా(2)
||నా ప్రాణమా||
2: నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను -
అంతము వరుకు నాతో ఉండరు (2)
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా -
నా ప్రాణము నీవే యేసయ్య (2)
||నా ప్రాణమా||
3: కన్నులు మూసిన కన్నులు తెరచిన -
నా చూపులలో నీ రూపమే (2)
కనికరించితివా కరుణామయుడా -
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా (2)
||నా ప్రాణమా||