నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా || 2 ||
అద్భుతం చేయుమయా
నా జీవితంలో -
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య || 2 ||
1: నీవే ఏదైనా చెయ్యలంటూ || 2 ||
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
తప్పక చేస్తావని నిన్ను నమ్మి || 2 ||
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా || 2||
2: నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను || 2 ||
నీ వాగ్ధానములను చేతపట్టి || 2 ||
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా || 2 ||