కరుణాసాగర యేసయ్యా Karuna Sagara Yesayya

కరుణాసాగర యేసయ్యా

కనుపాపగ నను కాచితివి

ఉన్నతమైన ప్రేమతో

మనసున మహిమగా

నిలిచితివి ||2||


1.మరణపులోయలో దిగులు చెందగా

అభయము నొందితి నినుచూచి

దాహముతీర్చిన జీవనది

జీవమార్గము చూపితివి

2.యోగ్యతలేని పాత్రనునేను

శాశ్వతప్రేమతో నింపితివి ||2||

ఒదిగితిని నీ కౌగిలిలో

ఓదార్చితివి వాక్యముతో ||2||

3.అక్షయస్వాస్థ్యము నే పొందుటకు

సర్వసత్యములో నడిపితివి ||2||

సంపూర్ణపరచి జ్యేష్ఠులతో

ప్రేమనగరిలో చేర్చుమయ్యా ||2||





Post a Comment

Previous Post Next Post