సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు Sari Rarayya Yesayya

 సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు 

సదా తోడు నిలిచావు నా అండవై (2)

భయమేమి లేదు నా బలము నీవే 

ఓటమే లేదు నా జయము నీవే (2)


అభినందనం నీకే నా యేసయ్యా 

అభిశక్తుడా నీకే నా ఆరాధన (2)   || సరిరారయ్యా ||


దివిలో ఉన్న దీవెనలన్నీ 

భువికే దించిన బహు ఘనుడవు (2) 

నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతి వారికి 

సిరులను కురిపించే శ్రీమంతుడవు (2)   || అభి || 


ఎదురవుతున్న పోరాటాలలో 

నాతో నిలిచిన బహు శూరుడా (2)

నీ నామం స్మరియించి స్తుతించిన ప్రతి వారికి 

జయ జీవిత మిచ్చే విజయ కరుడా (2)  || అభి ||


మంటి ఘటమైన నాలో నీవు 

మహిమైశ్వర్యమును నింపితివి (2) 

మారని నీ కృప నీ మమతల కోటలో 

జీవించెద కృతజ్ఞత తో కృపా కరుడా (2) || అభి ||





Post a Comment

0 Comments