గగనము చీల్చుకొని - ఘనులను తీసుకొని
నన్ను కొనిపోగ రానైయున్న
ప్రాణ ప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని ... నా హృదయమెంతో
ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది... || గగనము ||
1: నీ దయా సంకల్పమే - నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవెర్చుచున్నది (2)
పవిత్రురాలైన కన్యక గా
నీ యెదుటనే నేను నిలిచెదను (2)
నీ కౌగిలి లో నేను విశ్రమింతును (2). || గగనము ||
2: నీ మహిమైశ్వర్యమే - జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్నది - నీ వలె రూపించుచున్నది (2)
కళంకము లేని వధువు నై - నిరీక్షణ తో నన్ను చేరెదను (2)
యుగ యుగాలు నీతో యేలెదను (2) || గగనము ||
3: నీ కృపా బాహుళ్యమే - ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల సాక్ష్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో - అనాది ప్రణాళిక తో
సీయోను లో నీతో నే నుందును (2) || గగనము ||