బహు సౌందర్య సీయోనులో Bahu soundarya seeyonulo

బహు సౌందర్య సీయోనులో 

స్తుతి సింహాసనాసీనుడా 

నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై 

నా హృదయాన కొలువాయెనే 

నను జీవింప జేసె నీ వాక్యమే 

నాకిలలోన సంతోషమే


పరిశుద్ధత లో మహనీయుడవు

నీవంటి దేవుడు జగమున లేడు 

నాలో నిరీక్షణ నీలో సంరక్షణ  

నీకే నా హృదయార్పణ        || బహు ||


ఓటమి నీడలో క్షేమము లేక 

వేదన కలిగిన వేళల యందు 

నీవు చూపించిన నీ వాత్సల్యమే 

నా హృదయాన నవ జ్ఞాపిక       || బహు || 


ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు 

చల్లని నీ చూపే ఔషధమే

ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం 

నాలో నింపెను ఉల్లాసమే        || బహు ||




Post a Comment

0 Comments