అలంకరించును Alankarinchunu

 నా మనసా ఆయన మరచునా 

దేవుడు నిన్ను మరచి పోవునా (2)

ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే 

ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)

స్తుతింప చేయునే .. 

నిన్ను అలంక రించునే .. 

కోల్పోయినదంతా  పునరుద్ధించునే (2)  || నా మనసా ||


నిట్టూర్పు శబ్దము విన్న - నీ హద్దు లన్నిటిలో  

సమృద్ధి గానాలెన్నో - నీ మదిలో వినబడునే  (2)

తరిగి  పోను నేను  - అనగార్చబడను నేను (2)  

                                            || స్తుతింప ||


సరిచేయు వాడే - ఓ స్థిరపరచినాడే .

బల పరచి నాడే - ఓ పూర్ణుణ్ణి చేయునే (2) 

సరిచేసి నిన్ను హెచ్చించిన ప్రభువు   

ఈ నూతనవత్సరములో  అలంకరించునే  


విచారించే వారు లేక - ఒంటరియై యున్న నీకు 

ఆరోగ్యము దయచేసి - పరిపాలనిచ్చునే (2)

కూలిన కోటను రాజ గృహముగా మార్చును (2)

                                           || స్తుతింప ||




Post a Comment

0 Comments