ఆశీర్వాదంబుల్ మా మీద Aashirvaadamambul Maa Meeda

ఆశీర్వాదంబుల్ మా మీద

వర్షింపజేయు మీశ

ఆశతో నమ్మి యున్నాము

నీ సత్య వాగ్దత్తము


ఇమ్మాహి మీద

క్రుమ్మరించుము దేవా

క్రమ్మర ప్రేమ వర్షంబున్

గ్రుమ్మరించుము దేవా


ఓ దేవా పంపింపవయ్యా

నీ దీవెన ధారలన్

మా దాహమెల్లను బాపు

మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి ||


మా మీద కురియించు మీశ

ప్రేమ ప్రవాహంబులన్

సమస్త దేశంబు మీద

క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి ||


ఈనాడే వర్షింపు మీశ

నీ నిండు దీవెనలన్

నీ నామమందున వేడి

సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||







Post a Comment

Previous Post Next Post