ఇదిగో దేవా నా జీవితం Idigo deva naa jeevitam

ఇదిగో దేవా నా జీవితం

ఆపాదమస్తకం నీకంకితం (2)

శరణం నీ చరణం (4) ||ఇదిగో||


పలుమార్లు వైదొలగినాను

పరలోక దర్శనమునుండి

విలువైన నీ దివ్య పిలుపుకు

నే తగినట్లు జీవించనైతి (2)

అయినా నీ ప్రేమతో

నన్ను దరిచేర్చినావు

అందుకే గైకొనుము దేవా

ఈ నా శేష జీవితం ||ఇదిగో||


నీ పాదముల చెంత చేరి

నీ చిత్తంబు నేనెరుగ నేర్పు

నీ హృదయ భారంబు నొసగి

ప్రార్థించి పనిచేయనిమ్ము (2)

ఆగిపోక సాగిపోవు

ప్రియసుతునిగా పనిచేయనిమ్ము

ప్రతి చోట నీ సాక్షిగా

ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||


విస్తార పంట పొలము నుండి

కష్టించి పని చేయ నేర్పు

కన్నీటితో విత్తు మనసు

కలకాలం మరి నాకు నొసగు (2)

క్షేమ క్షామ కాలమైనా

నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా

నశియించే ఆత్మలన్

నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||




Post a Comment

Previous Post Next Post