మనసున్న మంచిదేవా Manasunna Manchi Deva

మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా

మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా

నా మది నీ కోవెలగా మలచుకోవయా

నా హృదిని రారాజుగా నిలిచిపోవయా


1: హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము

దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము

మనసు మర్మమెరిగిన మహనీయుడా

మనసు మార్చగలిగిన నిజదేవుడా


2: చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను

వంచన చేసి నడుపును తప్పు బాటను

అంతరంగమును పరిశీలించు యేసయ్యా

స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా


3: నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి

దీనమనస్సుతో నీకడ శిరము వంచితి

పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా

తరతరములకు క్షేమము చేకూర్చుమా




Post a Comment

Previous Post Next Post